డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ ని స్వరపరిచి విశేషంగా ఆకట్టుకున్న రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. ‘టిల్లు స్క్వేర్’తో రెట్టింపు వినోదాన్ని పంచి, ‘డీజే టిల్లు’ని మించిన విజయాన్ని సాధిస్తామని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
చిత్రం పేరు: టిల్లు స్క్వేర్
తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్
దర్శకుడు: మల్లిక్ రామ్
ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్
కూర్పు: నవీన్ నూలి
సంగీతం: రామ్ మిరియాల
కళ: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్